భారత్లో 24 గంటల్లో పెరిగిపోతున్న కేసులు..
- April 11, 2020
చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.మన భారత దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత నెల 24 న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో కరోనాని కట్టడి చేయడానికి ఎన్నో మార్గాలు అన్వేషిస్తునే ఉన్నారు. సాధ్యమైనంత వరకు కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
అయితే కరోనాని కట్టడి చేయాలని చూస్తున్నా.. భారత్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో ఏకంగా 1,035 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో కరోనా కేసుల సంఖ్య 7,447కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 1574 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 188 మంది కోలుకోగా, 110 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 911 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 903 మంది కరోనా బాధితులున్నారు. 25 మంది కోలుకోగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో దేశంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 6,565 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. 643 మంది కోలుకున్నారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!