నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ పొడిగింపుపై స్పష్టత
- April 11, 2020
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ చెలరేగిపోతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. లాక్‌డౌన్ విధించినప్పటితో పోలిస్తే కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో దీనిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, పొడిగింపు ఉంటుందా? లేదా? అన్న విషయమై నేడు స్పష్టత రానుంది.
ప్రధాని నరేంద్రమోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చించనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌ను కనుక పొడిగిస్తే ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతమేర సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో కొన్ని రంగాలను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?