భారత్‌లో 24 గంటల్లో పెరిగిపోతున్న కేసులు..
- April 11, 2020చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.మన భారత దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత నెల 24 న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో కరోనాని కట్టడి చేయడానికి ఎన్నో మార్గాలు అన్వేషిస్తునే ఉన్నారు. సాధ్యమైనంత వరకు కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
అయితే కరోనాని కట్టడి చేయాలని చూస్తున్నా.. భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో ఏకంగా 1,035 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో కరోనా కేసుల సంఖ్య 7,447కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 1574 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 188 మంది కోలుకోగా, 110 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 911 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 903 మంది కరోనా బాధితులున్నారు. 25 మంది కోలుకోగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో దేశంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 6,565 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. 643 మంది కోలుకున్నారు. 239 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!