చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతం
- April 11, 2020
హైదరాబాద్:పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిటల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్.గోపీచంద్ ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ సమయం పట్టింది అని సర్జరీ చాలా విజయవంతం అయ్యిందని తెలిసింది. ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్సెస్ ఫుల్ గా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆపరేషన్ గురించి చిరంజీవి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారు. ఆపరేషన్ పూర్తి అవ్వగానే మొదటి ఫోన్ డాక్టర్.గోపీచంద్ చిరంజీవి కి తెలియజేసారు.
మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ` డాక్టర్ గోపీచంద్ కి..వాళ్ల బృందానికి ధన్యవాదాలు. అలాగే ఈ విషయాన్ని సమయానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైదరాబాద్ వరకూ రావటానికి ఏర్పాట్లు చేసిన బి.దిలీప్ కి, ఇంతదూరం ప్రయాణించడానికి అనుమతిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకి..ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాని` అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







