ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ చెప్పిన విషయాలు
- April 11, 2020
ఢిల్లీ:అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సమావేశంలో దేశంలో కొనసాగుతున్న లాక్‌డైన్‌ను ఏప్రిల్ 14వ తర్వాత పొడిగించాలా.. వద్దా.. అన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత మోదీ మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భరోసా ఇచ్చారు. తాను 24గంటలూ అందుబాటులో ఉంటానని, అవసరమైన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందరం ఐక్యంగా ఉంది, కరోనా కట్టడికి కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వీడియలో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతోపాటు ముఖ్యమంత్రులు మాస్క్‌లను ధరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌కట్టడికి కేంద్రం నుంచి నిత్యం సహాయ సహకారాలు అందించాలని పలువురు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కోరినట్లు సమాచారం.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు.భారత దేశవ్యాప్తంగా ఒకే విధంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు కోరారు. రెడ్‌జోన్లలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులను కోరారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు రాత్రి లేదా.. ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 239కు చేరుకుంది. అయితే..24 గంటల్లో 1035 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 40 మంది మృతి మృతి చెందారు. ఆస్పత్రుల్లో 6656 మంది చికిత్స పొందుతున్నారు. 643మంది కోలుకున్నారు. అయితే.. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో మొత్తం 720 జిల్లాలు ఉన్నా.. దాదాపుగా 400 జిల్లాలో కరోనా వైరస్‌ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇదే సమయంలో దేశంలోని 133 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మోదీ నిర్ణయం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..