మాల్దీవుల్లో చిక్కుకున్న దుబాయ్‌కి చెందిన భారతీయ జంట

- April 11, 2020 , by Maagulf
మాల్దీవుల్లో చిక్కుకున్న దుబాయ్‌కి చెందిన భారతీయ జంట

దుబాయ్‌: దుబాయ్‌లో ఉండే కొత్త‌గా పెళ్లైన భారతీయ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి చిక్కుకుంది. మ‌హ‌మ్మారి క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టే క్ర‌మంలో అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో ఈ కొత్త జంట చిక్కుకుపోయింది. దుబాయ్‌లో ఉండే రోహన్ భాటియా, రియా భాటియాకు ఇటీవ‌లే వివాహ‌మైంది. దీంతో హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. మార్చి 20న‌ దుబాయ్‌కి తిరిగి రావాల్సింది. కానీ, మార్చి 19వ తేదీ మ‌ధ్యాహ్నం నుంచే విమాన స‌ర్వీసులు ఆగిపోయాయి. దాంతో ఈ న‌వ దంప‌తులు మాల్దీవుల్లోనే ఉండిపోయారు. ప్ర‌స్తుతం తాము ఇడిలిక్ బీచ్ రిసార్ట్‌లో ఉంటున్నామ‌ని, తిరిగి ఎప్పుడు వ‌స్తామో కూడా తెలియ‌డం లేద‌ని రోహన్ పేర్కొన్నాడు. దుబాయ్‌లో తాను ట్రేడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఇక మాల్దీవుల్లో ఇప్ప‌టివర‌కు 19 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 13 మంది కోలుకున్న‌ట్లు ఈ దంప‌తులు తెలిపారు.   

భారత రాయబార కార్యాలయం సహాయం చేస్తోంది, కాని రియా కెనడియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ కావడంతో మా పరిస్థితి క్లిష్టంగా ఉంది మరియు నాకు భారతీయ పాస్‌పోర్ట్ ఉంది. మేము ఇద్దరం  యూ.ఏ.ఈ లోని మా కుటుంబాలతో కలిసి స్థిరపడ్డాము మరియు అక్కడే మేము ఉంటున్నామని   రోహన్ భాటియా తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com