చైనా ను మళ్ళీ కలవరపెడుతున్న కరోనా
- April 11, 2020
వూహన్ : నోవల్ కరోనా వైరస్ గురించి ఇప్పటికీ అర్థం కావడం లేదని చైనా వైద్యులు వాపోతున్నారు. కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. ఈ వైరస్ మొదట కనిపించిన వూహన్‌లోనే ఈ కొత్త కేసులు నమోదయ్యాయి.
నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించేందుకు చైనా జనవరి నుంచి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే విదేశాల నుంచి చైనాకు వస్తున్నవారి వల్ల మళ్ళీ రెండోసారి ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని చైనా అధికారులు భయపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి మొదట్లో ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపించకపోవడం వల్ల, గుర్తించడం కష్టమని చెప్తున్నారు.
కోవిడ్-19 రోగుల కోసం వూహన్‌లో ఏర్పాటు చేసిన లీషెన్షన్ హాస్పిటల్ ప్రెసిడెంట్ వాంగ్ జింఘువాన్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈ వైరస్ సోకిన లక్షణాలు పైకి కనిపించకపోతే, అటువంటి ప్రయాణికుల వల్ల రెండోసారి వైరస్ విజృంభణ జరిగే అవకాశం లేదని చెప్పలేమన్నారు. అయితే రెండోసారి భారీ స్థాయిలో ఈ విజృంభణ ఉంటుందని నిపుణులు భావించడం లేదన్నారు. దీనికి కారణం చైనా అమలు చేస్తున్న కఠినమైన ఆంక్షలేనని చెప్పారు. అయితే నిర్లక్ష్యంగా ఉండకూడదని తెలిపారు. ఇప్పటి వరకు ఈ వైరస్ గురించి మనకు ఉన్న అవగాహన చాలా తక్కువ అని తెలిపారు.
వూహన్లోని ఝోంగ్నన్ హాస్పిటల్ డాక్టర్ ఝావో యాన్ మాట్లాడుతూ నోవల్ కరోనా వైరస్ ప్రవర్తన చైనాలో ఒక విధంగానూ, యూరోపు, అమెరికాలలో మరొక విధంగానూ ఉందన్నారు. అమెరికా, యూరోపుల్లో ఈ వైరస్ సోకినవారిలో చాలా మంది రుచి, వాసన చూడలేకపోతున్నారన్నారు. చైనాలో అటువంటి కేసులు చాలా తక్కువగా కనిపించాయన్నారు.
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 46 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీరిలో 42 మంది విదేశాల నుంచి వచ్చినవారే. గురువారం నమోదైన కొత్త కేసులు 42. హుబే ప్రావిన్స్‌లో వరుసగా ఏడో రోజు కొత్త కేసులు నమోదు కాలేదు.
తాజా వార్తలు
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..