కరోనా వైరస్‌: స్వదేశాలకు వెళ్ళేందుకు ఇండియన్స్‌కి యూఏఈ అనుమతి

- April 11, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: స్వదేశాలకు వెళ్ళేందుకు ఇండియన్స్‌కి యూఏఈ అనుమతి

దుబాయ్‌: భారతీయులు అలాగే ఇతర దేశాలకి చెందిన పౌరులు, యూఏఈ నుంచి ఆయా దేశాలకు వెళ్ళేందుకు యూఏఈ అనుమతినిచ్చినట్లు భారత్ లోని యూఏఈ రాయబారి డాక్టర్‌ అహ్మద్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ బన్నా వెల్లడించారు. దీనికి సంబంధించి యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఓ ‘నోట్‌ వెర్బలె’(Note Verbale)ని విడుదల చేయడం జరిగింది. అన్ని ఎంబసీలకూ ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు అల్‌ బన్నా వివరించారు. అయితే, కరోనా నెగెటివ్‌గా తేలినవారికి మాత్రమే తమ స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తారు. తమ దేశంలో అద్భుతమైన టెస్టింగ్‌ ఫెసిలిటీస్‌ వున్నాయనీ, 500,000 మందికి పైగా ఇప్పటికే పరీక్షలు నిర్వహించామని తెలిపారాయన. లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయినవారిని మానవీయ కోణంలో వారి దేశాలకు పంపించేందుకు చిత్తశుద్ధితో యూఏఈ వున్నట్లు వివరించారు. కరోనా పాజిటివ్‌గా తేలినవారిని మాత్రం యూఏఈలోనే వుంచుతారు. వారికి అక్కడే వైద్య చికిత్స అందిస్తారు. అయితే, ఈ విషయమై ఇంతవరకు భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రాలేదని వివరించారాయన. కాగా, స్వదేశాలకు పంపడంలో వృద్ధులు, గర్భవతులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. మరోపక్క, వీసా గడువు విషయంలో గల్ఫ్ దేశాల్లో వుంటోన్న భారతీయులెవరూ ఆందోళన చెందనవసరం లేదని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com