కోవిడ్-19 హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

- April 11, 2020 , by Maagulf
కోవిడ్-19 హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

ఏ.పి: సామాజిక మాధ్యమాల్లో కోవిడ్-19పై పూర్తి సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ ద్వారా కోవిడ్-19 సమాచారాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వదంతులకు తావు లేకుండా కచ్చితమైన సమాచారం కోసం సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసింది. వాట్సాప్ లో 8297104104 నెంబర్ ద్వారా, ఫేస్‌బుక్‌లో ఆరోగ్య ఆంధ్ర మెసెంజర్ ద్వారా కోవిడ్‌-19 సమాచారం పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com