కరోనా ఎఫెక్ట్: కువైట్ చేరుకున్న భారత్ రాపిడ్ రెస్పాన్స్ టీం
- April 11, 2020
కువైట్:కరోనా వైరస్ పై పోరాటంలో కువైట్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి భారత్ నుండి 15 మంది వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కూడిన రాపిడ్ రెస్పాన్స్ టీం శనివారం కువైట్ చేరుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
విశ్వవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో దాన్ని అరికట్టే దిశగా పరస్పర చర్యలు చేపట్టే విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కువైట్ ప్రధాని షేక్ ఖాలీద్ అల్ సభాకు ఫోన్ చేసి చర్చించారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు ఇరు దేశాలు తీసుకోవాల్సిన చర్యలు మరియు పరస్పర సహాకారం కొరకు ఇరు దేశాధినేతలు చర్చించారని కువైత్ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నిర్మూలనతో పాటు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ ఆంశాలపై కూడ రెండు దేశాల ప్రధానులు చర్చించారని విషయం తెల్సిందే.
ఈ వైద్య బృందం రెండు వారాల పాటు కువైట్‌లో ఉండాలని భావిస్తున్నారు,ఈ సమయంలో బాధిత వ్యక్తుల పరీక్ష,చికిత్స మరియు కువైట్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో భారత్ బృందం వైద్య సహాయం చేస్తుంది.భారత్ యొక్క రాపిడ్ రెస్పాన్స్ టీం కువైట్ చేరుకుంది.భారత్ మరియు కువైట్ మధ్య ప్రత్యేక స్నేహ బంధం ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు.
కువైట్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కువైట్‌లో 10 లక్షల జనాభా ఉన్న భారతీయులు అతిపెద్ద ప్రవాసుల సంఖ్య ఉంది.భారత్ కువైట్ కి అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని ఎస్.జైశంకర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







