ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే జైలే
- January 26, 2016
డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడితే ఇకపై జైలుకు వెళ్ళాల్సి రావొచ్చు 300 ఒమన్ రియాల్స్ ఫైన్ కూడా విధింపబడుతుంది. ఆ కోణంలో కొత్త రూల్స్‌ని అమల్లోకి తెచ్చేందుకు ఒమన్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నెల రోజుల నుంచి 24 నెలల వరకు జైలు శిక్ష విధించేలా, అధిక మొత్తంలో ఫైన్ విధించేలా చట్టాల రూపకల్పనలో అధికారులు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించిన పలు అమెండ్మెంట్స్ మజ్లిస్ అల్ షురా ఆమోదం పొంది ఉన్నాయి. 2014తో పోల్చితే ఒమన్‌లో రోడ్డు ప్రమాదాలు 2015లో 14.9 శాతం తగ్గాయి. 2014లో 6171 యాక్సిడెంట్లు జరగ్గా, 2015లో వీటి సంఖ్య 5,254కి తగ్గింది. కారు ప్రమాదాల్లో 618 మంది 2015లో చనిపోగా, 2014లో ఈ సంఖ్య 760గా ఉంది. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడానికి కఠినమైన చట్టాల్ని ఇంకా కఠినంగా అమలు చేయవలసి ఉందని అధికారిక వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









