కర్ఫ్యూ సమయాల్లో ఉద్యోగుల అనుమతికి ప్రత్యేక విధి విధానాలు రూపొందించిన సౌదీ

- April 13, 2020 , by Maagulf
కర్ఫ్యూ సమయాల్లో ఉద్యోగుల అనుమతికి ప్రత్యేక విధి విధానాలు రూపొందించిన సౌదీ

రియాద్:కర్ఫ్యూ సమయంలో ఉద్యోగులకు ప్రత్యేక అనుమతి ఇచ్చేలా సౌదీ అరేబియా విధి విధానాలను ఖరారు చేసింది. ఎంతమందికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది, ఏయే రంగాలకు మినహాయింపు ఇవ్వాలో పూర్తి సమీక్షించిన తర్వాత అంతర్గత మంత్రిత్వ శాఖ అనుమతి విధానాలను సరళీకరిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఆయా ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి పత్రాలు తప్పనిసరి అని
నిర్ణయించింది. ఈ అనుమతులపై అంతర్గత మంత్రిత్వ శాఖలోని సంబంధిత అధికారుల స్టాంప్ వేయించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో పని చేసే ప్రైవేట్ సంస్థల సిబ్బందికి కూడా ఆయా ప్రభుత్వ సంస్థలు అనుమతి పత్రాలు జారీ చేయాలి. 

ఇక సిబ్బందిని తరలించే బస్సు డ్రైవర్ కు కూడా అనుమతి అవసరం ఉంటుంది. బస్సు సామర్ధ్యంలో 50 శాతానికి మించి ప్రయాణికులను అనుమతించకూడదని, అలాగే వెళ్లే రూటు, ఎయే సమయాల్లో వెళ్తున్నారు, వారంలో ఎన్ని రోజులు సర్వీసు ఉంటుంది అనేది కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. 

అంతర్గత మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త విధానాలు ఇవాళ్టి (ఏప్రిల్ 13)నుంచే అమలులోకి రానున్నాయి. ఎవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 10 వేల సౌదీ రియాల్స్ జరిమానాతో పాటు న్యాయపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com