షాపింగ్‌ కోసం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌

- April 13, 2020 , by Maagulf
షాపింగ్‌ కోసం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌

కువైట్: మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, షాపింగ్‌ అపాయింట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్ కి సంబంధించి ట్రయల్‌ వెర్షన్‌ని ప్రారంభించింది. సిటిజన్‌ అలాగే రెసిడెంట్స్‌, షాపింగ్‌ కోసం తమ టైం ని బుక్‌ చేసుకోవడం ఈ చర్యకు ఉద్దేశ్యం. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ సిస్టమ్ ని లాంఛ్‌ చేశారు. షాపింగ్‌ డేట్‌ మరియు టైమ్ లను ఈ మేరకు ముందే వినియోగదారులు నిర్దేశించుకోవాలి. ఫిష్‌ మార్కెట్‌, స్లాటర్‌ హౌస్‌లు, కో-ఆపరేటివ్‌ స్టోర్స్‌, సెంట్రల్‌ మార్కెట్స్‌ వంటి వాటి కోసం టైమ్ స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి వుంటుంది. సివిల్‌ ఐడీ అలాగే సీరియల్‌ నెంబర్‌ని వెబ్‌సైట్‌లో పొందుపర్చడం ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకునే వీలుంటుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఎక్కువ జనం ఒకే చోట గుమికూడకుండా ఈ చర్యలు చేపడుతోంది కువైట్‌.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com