ఏటీఎం కార్డుల వ్యాలిడిటీ పెంపు, బ్యాంక్‌ అకౌంట్ల ఫ్రీజింగ్‌ రద్దు

- April 13, 2020 , by Maagulf
ఏటీఎం కార్డుల వ్యాలిడిటీ పెంపు, బ్యాంక్‌ అకౌంట్ల ఫ్రీజింగ్‌ రద్దు

రియాద్‌: సౌదీ అరేబియన్‌ మానెటరీ అథారిటీ (ఎస్‌ఎఎంఎ), ఏటీఎం కార్డుల వ్యాలిడిటీని జూన్‌ 2 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్లయింట్‌ అనుమతి తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది ఎస్‌ఎఎంఎ. నేషనల్‌ ఐడెంటిటీ కార్డ్‌ వేలిడిటీ గడువు తీరడం ద్వారా బ్యాంక్‌ అకౌంట్ల ఫ్రీజింగ్‌ అంశానికి సంబంధించి కూడా ఫ్రీజింగ్‌ని సస్పెండ్‌ చేస్తూ ఎస్‌ఎఎంఎ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ కొత్త డైరెక్టివ్స్‌ని ఎస్‌ఎఎంఎ విడుదల చేసింది. బ్యాంక్‌ క్లయింట్స్‌కి వివిధ కారణాలతో ఎదురయ్యే సమస్యలు తద్వారా బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్‌ అయ్యే ప్రమాదం వుండడంతో, ఆ ప్రమాదం నుంచి ఉపశమన చర్యలకు ఉపక్రమించింది ఎస్‌ఎఎంఎ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com