ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్టులు..హైదరాబాదీని జాబ్ నుంచి తొలగించిన దుబాయ్ కంపెనీ
- April 13, 2020
దుబాయ్:సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, అసత్య ప్రచారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు పదే పదే చెబుతున్నా..కొందరు అతివాదులు అదే పొరపాటు చేసి పీకల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇస్లాంకు వ్యతిరేకంగా భారత్ లోని మైనారిటీ వర్గాన్ని కించపరుస్తూ పెట్టిన పోస్టు అతని ఉద్యోగానికే ఎసరు పెట్టింది.
హైదరాబాద్ కు చెందిన నక్కా బాలకృష్ట దుబాయ్ లోని మోరో హబ్ డేటా సొల్యూషన్స్ లో చీఫ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అయితే..భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తికి ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కారణమంటూ కొద్ది రోజులుగా ఇండియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా మైనారిటీలపై విద్వేషపూర్వక పోస్టింగులను షేర్ చేస్తున్నారు. గల్ఫ్ లో కూడా కొందరు వ్యక్తులు ఇస్లాం విద్వేష పోస్టులను పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదీ నక్కా బాలకృష్ట తన ఫేస్ బుక్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ముస్లింలను కరోనా వైరస్ రూపంలో ఉన్న మానవ బాంబులుగా చిత్రీకరించేలా తన పోస్టింగులు ఉన్నాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుబాయ్ లో స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయం కాస్త కంపెనీ దృష్టికి వెళ్లటంతో మోరో హబ్ డేటా సొల్యూషన్స్ అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించింది. విద్వేషాలను రెచ్చగొట్టే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించింది. అలాగే కంపెనీ బ్రాండ్ వాల్యూని దెబ్బతీసేలా ప్రవర్తించే వారి విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!