కువైట్‌:భారతీయ కార్మికుడికి కరోనా వైరస్‌

- April 13, 2020 , by Maagulf
కువైట్‌:భారతీయ కార్మికుడికి కరోనా వైరస్‌

కువైట్‌ నేషనల్‌ పెట్రోలియం కంపెనీ, భారత కార్మికుడికి ఒకరికి కరోనా వైరస్‌ సోకినట్లు వెల్లడించింది. తమ కంపెనీ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి ఓ కాంట్రాక్టింగ్‌ కంపెనీ తరఫున ఆ కార్మికుడు పనిచేస్తున్నారని కెఎన్‌పిసి పేర్కొంది. కార్మికుడిని వెంటనే అల్‌ అదాన్‌ మాస్పిటల్‌కి తరలించగా, అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కాగా, కంపెనీ, ఆ ప్రాజెక్ట్‌ మీద వర్క్‌ని తాత్కాలికంగా నిలిపివేసింది. సదరు కార్మికుడిని​ ఎవర్ని అయినా కలిశారా.? ఇంకెవరికైనా కరోనా వైరస్‌ సోకిందా.? అనేదానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com