అంబేద్కర్ స్పూర్తితోనే జనసేన రూపకల్పన: పవన్ కల్యాణ్

- April 13, 2020 , by Maagulf
అంబేద్కర్ స్పూర్తితోనే జనసేన రూపకల్పన: పవన్  కల్యాణ్

అమరావతి: తన అసమాన ప్రతిభతో భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహనీయులు అంబేద్కర్ ‌అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రణామాలు అర్పిస్తున్నానని ఆయన తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చూపిన విజ్ఞత ఎంత పొగిడినా తక్కువేనన్నారు. భరతమాత దాస్యశృంఖలాల ఛేదన మొదలుకొని అణగారిన వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి చేసిన సేవలు అజరామరమైనవని చెప్పారు. అంబేద్కర్ స్పూర్తితో జనసేన పార్టీ రూపకల్పన జరిగిందని తెలిపారు. లండన్‌లో అంబేద్కర్ గృహాన్ని 2017 నవంబర్‌లో సందర్శించినప్పుడు అలౌకిక ఆనందాన్ని పొందానని, ఎంతో ఉత్తేజితుణ్ణయ్యానని పవన్ చెప్పారు. మరుసటి సంవత్సరం లక్నోలోని అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌కు వెళ్లి ఆ మహనీయుణ్ణి స్మరించుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో జనసేన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ఆ మహానుభావునికి అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com