బహిరంగ ప్రదేశాల్లో సమావేశం:నలుగురి అరెస్ట్‌

- April 13, 2020 , by Maagulf
బహిరంగ ప్రదేశాల్లో సమావేశం:నలుగురి అరెస్ట్‌

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, నలుగురు వ్యక్తుల్ని (ఖతారీలు) అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్‌లో వీరంతా సమావేశం అయ్యారన్నది నిందితులపై మోపబడ్డ అభియోగం. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఓ వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం ప్రమాదకరం. ఈ మేరకు మినిస్ట్రీ స్పష్టమైన నిబంధనల్ని ఖరారు చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బీచ్‌లు, పబ్లిక్‌ ప్లేస్‌లు, రెస్టారెంట్లు అలాగే కేఫెటేరియాల వద్ద జనం గుమికూడకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com