కోవిడ్ 19:భారీ శబ్ధాలతో ప్రశాంతతకు భంగం కలిగిస్తే వాహనాలు సీజ్
- April 13, 2020
మనామా:లాక్ డౌన్ విధింపుతో ఎక్కువ సమయంలో ఇంట్లోనే ప్రజల ప్రశాంతతకు ఇబ్బందులు తలెత్తకుండా బహ్రెయిన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి భారీ శబ్ధాలతో వాహనాలను నడిపితే ఆ వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది. స్వాధీనం చేసుకున్న వాహనాలను నెల వరకు తమ అధీనంలోనే ఉంటాయని కూడా వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ఇళ్లలో ఉండే ప్రజల ప్రశాంతతకు అధిక ప్రధాన్యం ఇస్తామని, మరీ ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో శబ్ధాలు చేసుకుంటూ వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రజలంతా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించినట్లు ప్రజలు ఒకే చోట గుమికూడొద్దని అధికారులు సూచించారు.
----రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







