మస్కట్: 10 ఏళ్లకు పైబడిన వాహనాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

- April 14, 2020 , by Maagulf
మస్కట్: 10 ఏళ్లకు పైబడిన వాహనాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు

మస్కట్: పదేళ్లకు పైబడిన పాత వాహనాలకు కూడా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఒమన్ ప్రభుత్వం  తెలిపింది. సాధారణంగా ఓ వాహనం మార్కెట్లోకి వచ్చి పదేళ్లు దాటితే దాని రిజిస్ట్రేషన్ కు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ వాహనాన్ని సాంకేతిక తనిఖీలు(ఫిట్నెస్ టెస్ట్) చేయాల్సి ఉంటుంది. వాహనం కండీషన్ లో ఉందని నిర్ధారించుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్ ను రెన్యూవల్ చేయటం జరుగుతుంది. అయితే..కరోనా వైరస్ కారణంతో వాహనాల రిజిస్ట్రేషన్ ఆఫీసులో వినియోగదారుల సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే పదేళ్ల పురాతన వాహనాలకు కూడా ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఎలాంటి తనిఖీలు చేయాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com