ఖతార్:ప్రభుత్వ సేవలు, కరోనా వైరస్, విద్యా రంగంలో సందేహాలకు కాల్ సెంటర్స్ ఏర్పాటు

- April 14, 2020 , by Maagulf
ఖతార్:ప్రభుత్వ సేవలు, కరోనా వైరస్, విద్యా రంగంలో సందేహాలకు కాల్ సెంటర్స్ ఏర్పాటు

దోహా:కరోనా వైరస్ విపత్తు సమయంలో ప్రజలకు చాలా విషయాల్లో ఆయోమయం నెలకొంది. ఏయే ప్రభుత్వ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి...రోజుకు ఎన్ని గంటల వరకు సేవలు అందిస్తున్నాయి..కరోనా వైరస్ పై అనుమానాలు, స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి..పిల్లల చదువుల పరిస్థితి ఏంటీ ఇలా ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వ కాల్ సెంటర్ కు ఫోన్ ల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం సమస్యలను బట్టి వేర్వేరుగా కాల్ సెంటర్లను ప్రారంభించింది. ప్రభుత్వ సేవలకు సంబంధించిన సందేహాల కోసం హాట్ లైన్ నెంబర్ 109కి ఫోన్ చేయాలని సూచించింది. అలాగే కరోనా వైరస్ కు సంబంధించిన సందేహాలపై సమాధానాలు, సూచనల కోసం హాట్ లైన్ 1600కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక విద్యా రంగానికి సంబంధించిన అన్ని సందేహాలు, సమాధానాల కోసం హాట్ లైన్ నెంబర్ 155తో కాల్ సెంటర్ ను ప్రారంభించింది. కాల్ సెంటర్స్ ప్రారంభంలో చాలా మంది వాటి సేవలను వినియోగించుకున్నారు. కరోనా వైరస్ హాట్ లైన్ 1600కి ఏప్రిల్ 12న దాదాపు 1729 ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే విద్యారంగానికి సంబంధించిన హాట్ లైన్ 155కి ఏప్రిల్ 12న 358 ఫోన్ కాల్స్ వచ్చాయి. 

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com