భారత్:10వేలు దాటిన పాజిటివ్ కేసులు
- April 14, 2020
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 10 వేలు దాటింది. రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మంగళావారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి.. దాంతో కరోనా బాధితుల సంఖ్య 10వేలు దాటింది.మరోవైపు గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు..
దాంతో మరణాల సంఖ్య కూడా 339 కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 10,363కు ఉండగా. ఇప్పటివరకు 339 మంది మృత్యువాత పడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని వెల్లడించింది. ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం వరకు 17,76,867 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో మొత్తం 1,11,828 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు