భారత్ లాక్డౌన్..మే 3 వరకు విమానాలు, రైళ్లు రద్దు
- April 14, 2020
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ను పొడిగించడమే కారణం
దిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 3 వరకూ లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.
'కొవిడ్ 19 విజృంభణ కారణంగా విధించిన లాక్డౌన్ నిబంధనల కొనసాగింపుగా అన్ని ప్యాసింజర్ రైళ్లను మే 3 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. వాటిలో ప్రీమియమ్, మెయిల్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్, కోల్కతా మెట్రో, కొంకణ్ రైల్వే తదితర రైళ్లు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల సరఫరా దృష్ట్యా కొన్ని గూడ్స్, పార్శిల్ రైళ్లకు మాత్రం అనుమతి ఉంది' అని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అప్పటి వరకు టికెట్ బుకింగ్ కౌంటర్లు కూడా మూసివేసే ఉంటాయని తెలిపింది. అలాగే లాక్డౌన్పై స్పందించిన విమానయాన మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా విమానాల రద్దుపై ప్రకటన చేసింది. 'దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధం మే 3 అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది' అని ట్వీట్ చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ఉదయం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పొడిగింపుకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, వైరస్ తీవ్రతను తగ్గించేందుకు పొడిగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







