ఒమన్‌లో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

- April 14, 2020 , by Maagulf
ఒమన్‌లో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: ఫుడ్‌ సేఫ్టీ మరియు క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్స్‌, ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్ట్‌ చేశారు. మనుషులు తినడానికి తగిన ప్రమాణాల్లేని ఆహారాన్ని సలాలా విలాయత్‌ మరియు దోఫార్‌  ప్రాంతాల్లో విక్రయిస్తున్నందున నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మినిరస్టీ ఆఫ్‌ రీజినల్‌ మునిసిపాలిటీస్‌ మరియు వాటర్‌ రిసోర్సెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్‌ మునిసిపాలిటీ సహకారంతో ఇన్‌స్పెక్టర్స్‌ ఈ తనిఖీలు నిర్వహించారు. నిందితులు వెజిటబుల్స్‌, ఫ్రూట్స్‌ మరియు ఫిష్‌ని విక్రయిస్తున్నట్లు తెలిపారు అధికారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేయడం జరిగింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com