ముందు జాగ్రత్తలు పాటించని కంపెనీకి జరీమానా
- April 14, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ (ఎంఎడిఎల్‌ఎస్‌ఎ), అల్ వహాబ్ ఏరియాలోని ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా లేకపోవడం, తగిన భద్రతా చర్యలు పాటించకపోవడంతో కంపెనీపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు. సెక్యూరిటీ అథారిటీస్‌తో కలిసి తగిన చర్యలు సంస్థపై వుంటాయనీ, ప్రస్తుతం సంస్థ ఉల్లంఘనలపై విచారణ జరుగుతోందని చెప్పారు. వర్క్ ప్లేస్‌లో కార్మికులకి భద్రత వుండాలనీ, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో అన్ని చర్యలూ తీసుకోవాల్సిందేనని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు హాట్‌లైన్ నెంబర్ 40280660ను అందుబాటులో వుంది. వర్క్ లేదా అకామడేషన్ వయొలేషన్స్‌పై ఈ నంబర్‌కి ఫిర్యాదు చేయొచ్చు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు