COVID19: దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను భారీ ఫీల్డ్ హాస్పిటల్‌గా వినియోగం
- April 15, 2020
దుబాయ్: యూఏఈ లో కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో రోగులకు చికిత్స అందించేందుకు దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఫీల్డ్ హాస్పిటల్(అత్యవసర సంరక్షణ అందించడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రి) గా ఉపయోగించనున్నారు. దీనికి 3,000 మందికి చికిత్స అందించే సామర్ధ్యం ఉందని తెలిపిన అధికారులు. ఇప్పటికే 'మామత్ డౌన్‌టౌన్' ను ఫీల్డ్ హాస్పిటల్ గా మార్చిన విషయం తెలిసిందే. కరోనా ను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని నివాసితులకు అధికారులు భరోసా ఇస్తున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ కుతామి మాట్లాడుతూ దుబాయ్‌లో త్వరలో రెండు ఫీల్డ్ ఆస్పత్రులు ఉంటాయని, 10,000 లేదా అంతకంటే ఎక్కువ కేసులను చేర్చుకోగల సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు