లాక్‌డౌన్ 2 మార్గదర్శకాలు విడుదల చేసిన భారత కేంద్ర ప్రభుత్వం
- April 15, 2020
ఢిల్లీ:మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించిన భారత కేంద్ర ప్రభుత్వం.ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలు కొనసాగిస్తూ మరికొన్ని జోడించింది.
కొత్త మార్గదర్శకాలు:
- ఏప్రిల్ 20 నుండి మే 3 వరకు కొనసాగుతుంది. రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం సూచనలు.
- లాక్ డౌన్ పై గైడ్లైన్స్ రిలీజ్ చేసిన కేంద్రం.
- మతపరమైన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాము.
- రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా లు బంద్.
- బయటకు వస్తే మాస్కులు తప్పని సరి.
- ఏప్రిల్ 20 తర్వాత హాట్స్పాట్ కానీ ప్రాంతాల్లో సడలింపు.
- రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం.
- ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి.
- రోడ్లు, రైలు, వాయు మార్గాలు బంద్.
- హాట్ స్పాట్ లో కఠిన నిబంధనలు. హాట్స్పాట్ లలో నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవు.
- అంత్యక్రియలు ఇతర కార్యక్రమాల్లో 20 మందికి మాత్రమే అనుమతి.
- ఆన్లైన్ షాపింగ్ ఇ-కామర్స్ లకు అనుమతి.
- హాట్ స్పాట్ లో జనం బయటకు రాకూడదు. బయటకు వస్తే బైక్ సీజ్ చేయడంతోపాటు అట్టి వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.
- సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్, బహిరంగ సభలు పూర్తిగా బంద్.
- వ్యవసాయం. అనుబంధ రంగాలకు అనుమతి.
- గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలకు అనుమతి.
- స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్ జింస్, స్టోర్స్, బార్లు, పూర్తిగా మూసివేయాలి.
- పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సిఎన్జి రవాణాకు అనుమతి.
- విద్యా సంస్థలు పూర్తిగా మూసి వేయాలి.
- హాట్స్పాట్ కేంద్రాలపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
- అన్ని మత పరమైన ప్రార్థన మందిరాలను మూసివేయాలని కేంద్రం సూచన.
- అన్ని హెల్త్ సర్వీసులు కొనసాగించాలని కేంద్రం నిర్ణయం.
- ఉపాధి హామీ పథకంలో సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చిన కేంద్రం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు