సౌదీ అరేబియా: జెడ్డా మెయరాల్టీలో 50 వేల కార్మికులకు చెకప్
- April 15, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్ వ్యాప్తని అరికట్టేందుకు ప్రతీ అంశంలోనూ సౌదీ అరేబియా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇక వలస కార్మికులకు కేటాయించిన గదుల్లో ఎక్కువ మంది ఉండటాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దీంతో కార్మికులు ఉండే గదుల్లో సామాజిక దూరం అమలయ్యేలా చర్యలు చేపడుతోంది. వివిధ గవర్నరేట్ వారి నివాస సదుపాయలను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జెడ్డా మేయరాల్టి తమ పరిధిలో కార్మికుల నివాస సముదాయాల కోసం దాదాపు 531 ప్రదేశాలతో జాబితా సిద్ధం చేసింది. 23 ప్రభుత్వ స్కూళ్లలో 1,962 మందికి వసతి సౌకర్యం కల్పించింది. అలాగే మేయర్ కార్యాలయ అధికారులు కార్మికుల నివాస ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 220 ప్రాంతాల్లో పర్యటించి దాదాపు 55 వేల మంది కార్మికులను చెకప్ చేశారు. వారు ఉండే గదులు, నివాస ప్రాంతాల్లో క్రిమి సంహారక చర్యలు చేపట్టినట్లు మేయర్ కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







