ఈ నెల 19న తెలంగాణ కేబినెట్ భేటీ

- April 16, 2020 , by Maagulf
ఈ నెల 19న తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్:ఈ నెల 19న మద్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగుతుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com