కోవిడ్ 19: వైరస్ నేపథ్యంలో మినిస్ట్రి నిబంధనలు పాటించి 3 ఖతార్ కంపెనీలపై చర్యలు
- April 16, 2020
దోహా:కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ఖతార్ ప్రభుత్వం..కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇప్పటికే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించటంతో పాటు..కార్మికులను తరలించే బస్సుల్లో పూర్తి సామార్ధ్యంలో 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించింది. అయితే పెర్ల్ లోని మూడు నిర్మాణరంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు కార్మిక, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. బస్సుల్లో కార్మికులను మూకుమ్మడిగా తరలిస్తున్నారని, అలాగే పని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించకుండా ఎక్కువమందిని పనికి పురమాయించినట్లు అధికారులు గుర్తించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు పూర్తి విఘాతం కలిగించేలా నిర్మాణ సంస్థలు వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల తరలింపు, పని పురమాయింపు విధులను పర్యవేక్షించే ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించారు.
తాజా వార్తలు
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







