కువైట్: అవుట్ పాస్ ఫీజు మాఫీ చేసిన వి.మురళీధరన్
- April 17, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను దక్కించుకునేందుకు పెద్దయెత్తున ఇండియన్స్ ముందుకొస్తున్నారు. ఎలాంటి జరీమానాలూ లేకుండా దేశం విడిచి వెళ్ళేందుకు వీలుగా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్షను తెరపైకి తెచ్చింది. ఫర్వానియా మరయు జిలీబ్ ప్రాంతాల్లో రెండు క్షమాభిక్ష కేంద్రాల్ని భారతీయుల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 20 వరకు క్షమాభిక్ష అభ్యర్థనల్ని ఈ సెంటర్స్ స్వీకరిస్తాయి. ఉదయం 8 గంటల నంచి 2 గంటల వరకు ఇందుకు అనుమతినిస్తున్నారు.
పాస్ పోర్టులు అందుబాటులో లేని మనవారు ఇండియన్ ఎంబసీ ద్వారా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (తెల్లరంగులో ఉండే తాత్కాలిక పాస్ పోర్టు) పొందవచ్చు. ఇందుకు చెల్లించాల్సిన ఫీజు 5 దీనార్లు ను మాఫీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఫీజు మాఫీ విషయాన్ని మంత్రి ఇంగ్లిష్, హిందీ తోపాటు మాతృభాష మలయాళంలో ట్విట్టర్ లో వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు







