ఎతిహాద్ రైల్ స్టేజ్ 2 టెండర్ ప్రాసెస్ రద్దు
- January 27, 2016
ఎతిహాద్ రైల్ స్టేజ్ 2 టెండర్ ప్రాసెస్‌ని సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి బిడ్డర్స్ అందరికీ రాతపూర్వకంగా సమాచారం అందించడం జరిగిందని యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ డెవలపర్ మరియు ఆపరేటర్ వెల్లడించారు. గ్వెయిఫాత్ వద్ద సౌదీ బోర్డర్ నుంచి అల్ ఎయిన్ వద్ద ఒమన్ బోర్డర్ వరకూ కనెక్ట్ చేసే రైల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఎతిహాద్ రైల్ స్టేజ్ 2ను ప్లాన్ చేశారు. ముసాఫా, ఖలీఫా పోర్ట్ జెబెల్ అలీ పోర్ట్‌లను కలిపేలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఎతిహాద్ రైల్ ఇప్పటికే స్టేజ్ వన్ రైల్ నెట్వర్క్ని ప్రారంభించింది. 4 మిలియన్ టన్నుల సల్ఫర్ షా అండ్ హబ్సన్ నుంచి రువాయిస్ పోర్ట్ వరకు అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ కోసం సరఫరా చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కమర్షియల్ కెపాసిటీని రీచ్ అయితే ఏడు మిలియన్ టన్నుల సల్ఫర్‌ని ప్రతి సంవత్సరం సరఫరా చేయగలుగుతుంది. మొత్తం మూడు స్టేజ్లలో ఎతిహాద్ రైల్ నెట్వర్క్ని ప్లాన్ చేశారు. ఇది జిసిఇ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయవలసి ఉంది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









