అబుధాబి: కార్మికులకు ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు
- April 17, 2020
అబుధాబి: కరోనా కట్టడికి యావత్ ప్రపంచం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. గల్ఫ్ లో కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సదరు ప్రభుత్వాలు కోరుతున్నాయి. అబుధాబి లోని కార్మికుల సంరక్షణ కోసం యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అందుబాటులో ఉంచుతోంది. సమాజం యొక్క ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా అబుధాబి లోని ముస్సాఫాలో కార్మికుల కోసం ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేసారు. వీటిలో కార్మికులకు ఉచితంగా కోవిడ్ -19 పరీక్షలు నిర్వహిస్తారు.
మరీ ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, లేదా దగ్గు, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వైరస్ లక్షణాలను ప్రదర్శించేవారు క్లినిక్‌లలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సిఫారసు చేశారు. రెసిడెన్సీ వీసా లేనివారు సైతం ఈ పరీక్షలు చేయించుకునేందుకు ఎటువంటి నిబంధనలు లేవని అధికారులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?