ఏపీలో 603 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- April 18, 2020
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31 కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 603 కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా 42 మంది డిశ్చార్జ్ కాగా మరణాల సంఖ్య 15 గా ఉంది. మరణాలు, డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో 546 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి. అంనంతపురం 26, చిత్తూరు 30, కడప 37, కృష్ణ 70, తూర్పు గోదావరి 19, నెల్లూరు 67, ప్రకాశం 44, విశాఖపట్నం 20, గుంటూరు 126, కర్నూల్ 129, పశ్చిమ గోదావరి 35 గా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







