దుబాయ్:ఆత్మహత్య చేసుకున్న ప్రవాస కార్మికుడికి కరోనా లైదు..క్లారిటీ ఇచ్చిన పోలీసులు
- April 18, 2020
దుబాయ్ పరిధిలోని జెబెల్ అలీ ప్రాంతంలో ఏసియన్ వ్యక్తి ఆత్మహత్యపై జరుగుతున్న ప్రచారాన్ని పోలీసుల కొట్టిపారేశారు. 47 ఏళ్ల ఏసియన్ వ్యక్తి తనకు కరోనా సోకిందని..అందువల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికంగా అపోహలు నెలకొన్నాయి. అయితే..పోలీసులు మాత్రం స్థానికంగా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. చనిపోయిన వ్యక్తికి వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. అయితే..అతను ఏ కారణంతో చనిపోయాడో తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఇదిలాఉంటే ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి తన ఫ్లోర్ లోని బాత్రూంలో ముందుగా కాలి నరాలకు కట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకటంతో కింద పార్క్ చేసిన కారుపై పడి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యరాత్రి 12.20 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







