సీసీసీకి నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం
- April 18, 2020
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తోన్న కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్రముఖ నిర్మాత మోహన్ చెరుకూరి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. షూటింగ్లు లేక ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినందనీయమనీ, అందులో తనూ భాగం కావాలనే ఉద్దేశంతో తన వంతుగా ఈ విరాళం అందిస్తున్నాననీ ఆయన చెప్పారు. కరోనా ఉధృతిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయనీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా తమ విధులను అహర్నిశలూ నిర్వహిస్తున్నారనీ ఆయన కొనియాడారు. అలాగే ఈ విపత్కర పరిస్థితుల్లో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమించడం గొప్ప విషయమని మోహన్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు చేస్తున్న ఈ కృషికి తగ్గట్లు పౌరులుగా మనందరం మన ఇళ్లల్లోనే క్షేమంగా ఉంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మన వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







