అప్పటి నుంచి విమానాలు నడుస్తాయట!
- April 18, 2020
ఢిల్లీ:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో విదేశీ విమాన సర్వీసులతో పాటు దేశీయ విమాన సర్వీసులను సైతం గత నెలలోనే కేంద్రం నిలిపేసింది. దీంతో విమాన సర్వీసులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మే 3వరకు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో... ఆ తరువాతైనా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయా లేక ఇందుకు మరింత సమయం పడుతుందా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే దీనిపై కొంతమేర స్పష్టత ఇచ్చింది ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా. కొన్ని విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ మే 4 నుంచి మొదలవుతాయని సంస్థ ప్రకటించింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి బుకింగ్స్‌ను జూన్ 1 నుంచి మొదలవుతాయని స్పష్టం చేసింది. అయితే ఏయే నగరాలకు ముందుగా బుకింగ్స్ మొదలవుతాయనే అంశంపై మాత్రం ఎయిర్ ఇండియా క్లారిటీ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?