తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు...
- April 19, 2020
హైదరాబాద్:భారత దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను లాక్ డౌన్ పేరుతో హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు.
ప్రెస్ మీట్ అంశాలు
- తెలంగాణ లో నేడు కొత్తగా 18 కరోన కేసులు
- తెలంగాణ లో ఇప్పటి వరకు 858 కేసులు నమోదు
- 31 జిల్లాలో 4 జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేవు
- ఇప్పటి వరకు 186 మందిని డిశ్చార్జ్ చేశాం, 651 మంది చికిత్స పొందుతున్నారు
- నేటి వరకు తెలంగాణ మొత్తంలో కరోన వ్యాధి వల్ల 21 మంది మృతి
- దేశం మొత్తంలో 8 రోజులకు ఒకసారి కరోన కేసులు డబల్ అవుతుంటే మన తెలంగాణ లో 10 రోజులకు ఒకసారి పెరుగుతున్నాయి
- తెలంగాణ లో రేపటి నుండి ఎటువంటి సడలింపులు ఉండవు
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటు తెలంగాణలో ఎటువంటి సడలింపులు ఉండవు
- ప్రపంచ మొత్తంలో 42 దేశాలు మొత్తం లాక్ డౌన్ లో ఉన్నాయి, మన దేశం కూడా మే 3 వరకు సంపూర్ణ లోక్డౌన్ లో ఉంది
- క్యాబినెట్ మీటింగ్ లో సుదీర్ఘ చర్చ , ప్రజా సేకరణ, మీడియా సర్వే ల అనుగుణంగా లాక్ డౌన్ ని తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల మే 7 వరకు లాక్ డౌన్ ని పొగిస్తున్నాం
- ఆన్లైన్ లో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న ఆన్లైన్ సర్వీసులను లాక్ డౌన్ ఉన్నంత వరకు ఆపివేయబడుతునం
- పండుగలు, పబ్బలు ఇంట్లోనే జరుపుకోవాలి
- సర్పంచ్ నుండి మంత్రి వరకు ప్రజాప్రతినిధులు చాలా బాగా పనిచేస్తున్నారు
- ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు ఇస్తాం, పెన్షనేర్లకు మాత్రం 75 శాతం డబ్బులు ఇస్తాం
- ఇప్పటి వరకు ప్రకటించిన విదంగా గ్రామ పంచాయతీ, మునిసిపల్, డాక్టర్ లకు, పోలీసు ఉద్యోగులకు నగదు ప్రోత్సకాలు ఎదవిడిగా ఇస్తాం
- ఇంటి కిరాయి దారులకు 3 నెలల కిరాయి వసూలు చేయకూడదు, రేపటికి విడతల వారిగా తీసుకోవాలి తప్ప వడ్డీ వసూలు చేయకూడదు
- ఎవరైనా ఇబ్బంది పెట్టుతే 100 కు డయల్ చేయాలి
- ప్రైవేట్ విద్య సంస్థలు వచ్చే విద్యా సంవత్సరంలో ఫీ పెంచ కూడదు, ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలి, తల్లిదండ్రులు కు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు
- తెల్ల రేషన్ కార్డు దారులకు *మే* నెల బియ్యం, ఒక వ్యక్తి కి 12 కిలో చొప్పున ఇచ్చి, 1500 నగదు ఇస్తాం, వచ్చే నెల 7 లోపు ఇచ్చి తిరుతం
- మీ నగదు డబ్బు నెల మొత్తంలో తీసుకోవచ్చు, బ్యాంక్ ల దగ్గర గుంపులు గుంపులు గా ఉండకూడదు
- పరిశ్రమలకు ఏప్రిల్, మే నెల డిఫర్ మెంట్ (కరెంట్) చార్జీలు మొత్తం మాఫీ చేస్తునం
- గచ్చిబౌలి స్టేడియం లో గలా 14 అంతస్తుల భవనం ని వైద్య విధాన పరిషత్ ఆధీనంలో తీసుకొని 1500 పడకల కోవిడ్ స్పెషల్
- దవాఖాన ఏర్పాటు చేస్తాం
- రైతులు పండిస్తున్న ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తాం
- ★ మే 5 తర్వాత ఎరువులు కోనుగోలు చేసుకోని వచ్చే రబి కొరకు సన్నద్ధంగా ఉండండి
- మే తర్వాత కూడా పెండ్లిలకు, శుభ కార్యాలకు ఫంక్షన్ హాల్ లు ఇవ్వబడదు, అట్టి ఫంక్షన్ హాల్ లలో ఫెర్టిలిజర్ గోడౌన్ కొరకు వాడుకోవాలి
- వ్యాధి ప్రమాద స్థాయిలో ఉంది,
- లాక్ డౌన్ ని మరింత పటిష్టంగా అమలు పరచాలి, అనవసరంగా బయటకి రావద్దు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించండి
- కరోన వైరస్ కు మందు లేదు... స్వీయ నియంత్రనే మార్గం
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







