కరోనా/సౌదీ: తెలంగాణ వాసి మృతి... మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ జాగృతి

- April 21, 2020 , by Maagulf
కరోనా/సౌదీ: తెలంగాణ వాసి మృతి... మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించిన  తెలంగాణ జాగృతి

సౌదీ అరేబియా:కరోనాతో దేశం కానీ దేశంలో మరణించిన ప్రవాస భారతీయుడి అంత్యక్రియలకు సహకరించి తెలంగాణ జాగృతి తన మానవత్వాన్ని చాటుకుంది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ అజ్మతుల్లా ఉపాధి నిమిత్తం 35 ఏళ్ల కిందటే సౌదీ అరేబియా వెళ్లాడు.

మక్కాలోని ఓ కంపెనీలో అజ్మతుల్లా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. తొలుత ఆయనలో ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడలేదు. అయితే స్నేహితుల సూచన మేరకు మక్కాలోని ఓ ఆసుపత్రిలో చేరి, గత గురువారం మరణించాడు.

ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అజ్మతుల్లా ఖాన్‌ నలుగురు పిల్లలు సౌదీలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా వారు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వీలు లకేండా పోయింది.

దీంతో అజ్మతుల్లా ఖాన్ అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత దృష్టికి వెళ్లడంతో ఆమె వెంటనే స్పందించారు. సౌదీ అరేబియాలోని తెలంగాణ జాగృతికి చెందిన నేత మౌజం అలీని అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కవిత సూచించారు.

ఆమె సూచన మేరకు మౌజం అలీతో పాటు సామాజిక కార్యకర్త ముజీబ్ సహకారంతో సౌదీ చట్టాల ప్రకారం అంత్యక్రియలకు లాంఛనాలను పూర్తిచేశారు. తమ తండ్రిని కడసారి చూసుకోలేకపోయినా, కుటుంబసభ్యుల్లా భావించి అంత్యక్రియలకు అన్నీ తానై వ్యవహరించిన తెలంగాణ జాగృతికి అజ్మతుల్లా ఖాన్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com