కువైట్:మే 28 వరకు రమదాన్ సెలవులు..16 గంటలు పాక్షిక కర్ఫ్యూ
- April 21, 2020
కువైట్:రమదాన్ మాసానికి సంబంధించి కర్ఫ్యూ సమయాలను, జాతీయ సెలవు రోజుల వివరాలను కువైట్ ప్రకటించింది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించింది. అలాగే రమదాన్ సందర్భంగా జాతీయ సెలవులను మే 28 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఆదేశాల మేరకు మే 28 వరకు సెలవులు పొడిగించాలని...తిరిగి మే 31, ఆదివారం నుంచి పని దినాలను ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇక కరోనా కట్టడికి రమదాన్ మాసంలోనూ కర్ఫ్యూని పొడగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే..రంజాన్ సందర్భంగా రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్స్ కి మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్స్ నుంచి హోమ్ డెలివరీలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!