కోవిడ్ 19: ఒమన్ కు 10 లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు సరఫరా చేసిన భారత్
- April 21, 2020
ఒమన్:మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంజీవిగా మారాయి. దీంతో హైడ్రాక్సీక్లోరోక్వీన్ నిల్వలు పుష్కలంగా ఉన్న భారత్ వైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే అమెరికాతో పాటు 30 దేశాల వరకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను సరఫరా చేసి వైరస్ పై పోరాటంలో తనవంతు పాత్రను పోషించింది. ఇక ఇప్పుడు మిత్రదేశంగా భావించి ఒమన్ కు కూడా ఆపన్నహస్తం అందించింది. ఒమన్ అభ్యర్ధన మేరకు ఆ దేశానికి పది లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను సరఫరా చేసింది. దీంతో ఒమన్ ప్రభుత్వం సరైన సమయంలో మాత్రలు పంపించిన భారత్ సాయానికి ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







