కోవిడ్19 :కంపెనీలు, యజమానులు కార్మికులకు తప్పనిసరిగా ఆరోగ్య భీమా కల్పించాల్సిందే
- April 21, 2020
దుబాయ్:కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి సంస్థ, కంపెనీ, యజమానులు తమ కార్మికులకు తప్పనిసరగా ఆరోగ్య బీమా చేయించాల్సిందేనని దుబాయ్ ఆరోగ్య భీమా సంస్థ సీఈవో సలెహ్ అల్ హషిమి ప్రకటించారు. ఆరోగ్య భీమా చట్టం నెం.11, 2013 ప్రకారం ప్రతి యజమాని, స్పాన్సర్ భీమా కల్పించటం తప్పనిసరి అని గుర్తు చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, కార్మికుల భీమా కల్పించటం, రెన్యూవల్ చేయటం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను మేం క్షణ్ణంగా గమనిస్తున్నాం, సంస్థలు ఎదుర్కుంటున్న సవాళ్లను గుర్తించాము. అయినా..ఉద్యోగులకు భీమా కల్పించటం అనేది కనీస బాధ్యతని, తద్వారా వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని దుబాయ్ ఆరోగ్య బీమా సంస్థ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







