యూఏఈలో మత అసహనానికి చోటు లేదు: షేఖా హెంద్
- April 22, 2020
యూఏఈలో మత అసహనానికి, విద్వేషానికి తావు లేదని యూఏఈ వ్యాపారవేత్త, సామాజికవేత్త షేఖా హెంద్ అల్ ఖాసిమి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇస్లాంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశించి ఆమె ఇలా స్పందించారు. తాను భారతీయులతో కలిసే పెరిగానని, తనకు తెలిసిన భారతీయులు పరమత సహనంతో ఉంటారని ఆమె అన్నారు. కానీ, సోషల్ మీడియాలో ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి భారతీయులు కారణమని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. డీ యాక్టీవ్ అయిన అకౌంట్ నుంచి ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసి షేఖా హెంద్ షేర్ చేశారు. ఇలాంటి వివక్షపూరిత ఆరోపణలు చేస్తే యూఏఈ ప్రభుత్వం జరిమానా విధించటంతో పాటు దేశ బహిష్కరణ విధిస్తుందని ఆమె హెచ్చరించారు. నిజానికి తనకు తబ్లిగీ జమాత్ గురించి తెలియపోయినా..ఇలా విద్వేషాలను ప్రేరేపించే ట్వీట్లను మాత్రం స్వాగతించబోమని షేఖా హెంద్ స్పష్టం చేశారు.
వ్యాపారవేత్త షేఖా హెంద్ కు ఎమిరాతి తర్వాత భారత్ తో అనుబంధం ఎక్కువ. ఇటీవలె ఆమె కొన్ని రోజుల పాటు భారత్లో పర్యటించారు. బెంగళూరులోని ఓ ఆశ్రమంలో యోగా అభ్యాసం చేసి తిరిగి యూఏఈ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రవాస భారతీయుల నుంచి ఇస్లాం వ్యతిరేక విమర్శల ఊహించలేదని అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎమిరాతీ సమాజం ప్రవాస భారతీయుల మీద ఆధారపడి ఉందని విశ్వసుస్తానని, అయినా..ఇలాంటి మత సహనం లేని వ్యక్తులతో డీల్ చేయలేమని కూడా ఆమె స్పష్టం చేశారు. 'భారత్ లో 2021 డిసెంబర్ నాటికి ముస్లింలు, క్రిస్టియన్లు ఉండరని ఓ ట్వీట్ లో చూశాను. ఇది భారత్ ఐడియాలజీకి పూర్తిగా భిన్నమైనది. త్వరలోనే పరిస్థితులు చక్కబడుతాయని ఆశిస్తున్నా' అంటూ షేఖా హెంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!