షార్జా:స్టెరిలైజేషన్ విధుల్లో ఉన్న ఫైర్ ఫైటర్ ప్రమాదవశాత్తు దుర్మరణం
- April 22, 2020
షార్జా:షార్జా గవర్నరేట్ పరిధిలో ఓ అగ్నిమాపక ఉద్యోగి ప్రమాదవశాత్తు దుర్మణం పాలయ్యాడు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా షార్జా అధికారులు అల్ ఖన్ బ్రిడ్జి దగ్గర చేపట్టిన క్రిమి సంహారక ప్రక్రియ (స్టెరిలైజేషన్) నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 31 ఏళ్ల ఎమిరాతి ఫైర్ ఫైటర్.. ఫైర్ ట్రక్ ను డ్రైవ్ చేస్తూ ప్రమాదవశాత్తు ఓ ఇనుప బారియర్ ను ఢి కొటడంతో వాహనం పలు మార్లు పల్టికొట్టింది. దీంతో ఫైర్ ఫైటర్ కు తీవ్రగాయాలయ్యాయి. రాత్రి 10 గంటల సమయంలో విషయం తెల్సుకున్న పోలీసులు కేవలం రెండు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రామాదానికి గురైన ఫైర్ ఫైటర్ ను సమీపంలోని అల్ ఖస్సిమి ఆస్పత్రికి తరలించారు. అయితే..ఆయన అప్పటికే మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు ఫుజైరాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?