కరోనా సోకిందని ప్రవాస భారతీయుడి ఆందోళన..వైద్య పరీక్షలు నిర్వహణ

- April 22, 2020 , by Maagulf
కరోనా సోకిందని ప్రవాస భారతీయుడి ఆందోళన..వైద్య పరీక్షలు నిర్వహణ

యూఏఈలోని అజ్మన్ లో ఓ ప్రవాస భారతీయుడిలో కరోనా లక్షణాలు కనిపించటంతో స్థానికంగా కలకలం రేపింది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో అతనికి కరోనా సోకి ఉండొచ్చని అంతా కంగారు. విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు. ట్వీట్ లో ప్రవాస భారతీయుడి అభ్యర్ధనపై స్పందించిన అజ్మన్ పోలీసులు వెంటనే అతను ఉండే అల్ జర్ఫ్ ఇండస్ట్రియల్ ఏరియా-2కి వెళ్లి పరిశీలించారు. ప్రవాస కార్మికుడికి నిజంగానే విపరీతమైన జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉంటడంతో అజ్మన్ వైద్య అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే..రిపోర్ట్స్ లో అతనికి కరోనా నెగటీవ్ రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతనికి సాధారణ ఫ్లూ కారణంగానే జ్వరం వచ్చిందని తెలిపారు. ఇదిలాఉంటే..కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికుల ఆరోగ్య సంరక్షణ యజమానుల బాధ్యతని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని అజ్మన్ అధికారులు యజమానులకు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com