దుబాయ్ :ఆదివారం నుంచి మెట్రో, బస్, ట్యాక్సీ సర్వీసులు మళ్లీ ప్రారంభం

- April 24, 2020 , by Maagulf
దుబాయ్ :ఆదివారం నుంచి మెట్రో, బస్, ట్యాక్సీ సర్వీసులు మళ్లీ ప్రారంభం

 దుబాయ్‌:లాక్‌ డౌన్‌ తో దుబాయ్‌ లో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన ప్రజారవాణా మళ్లీ ప్రారంభం కానుంది. వచ్చే ఆదివారం నుంచి దుబాయ్‌ మెట్రోతో పాటు బస్సులు కూడా తమ సాధారణ సర్వీసులను ప్రారంభించనుంది. అలాగే ట్యాక్సీ కార్లు కూడా రోడ్ల మీదకు రానుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దుబాయ్‌ సుప్రీం కమిటీ సూచనల మేరకు కొన్నాళ్లుగా ప్రజారవాణా సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..వైరస్‌ ప్రభావాన్ని సమీక్షించుకున్న తర్వాత వచ్చే ఆదివారం నుంచి ప్రజారావాణా సర్వీసులకు సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దుబాయ్ రవాణా శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే మెట్రో, బస్సు సర్వీసుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేస్తామని..ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండబోవని కూడా అధికారులు స్పష్టం చేశారు. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైల్‌ నడుస్తుంది. ఇక బస్సు సర్వీసులు 13 రూట్లలో నడుస్తాయని..సాధారణ టైం టేబుల్‌ (ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అయితే..కరోనా వైరస్‌ కట్టడికి అన్ని ముందు జాగ్రత్తలు పాటించి తీరాల్సిందేనని కూడా రవాణాశాఖ అధికారులు తెలిపారు. బస్సు, మెట్రో రైలులో సామాజిక దూరం పాటించటంతో పాటు..అందరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఇక ట్యాక్సీలో డ్రైవర్‌ తో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com