ఖతార్:గడువు ముగిసిన ఆహార పదార్థాల రీప్యాక్..19 మంది అరెస్ట్
- April 24, 2020
దోహా:కరోనా కష్టకాలాన్ని అడ్డదారిలో డబ్బు సంపాదనకు వినియోంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. మాస్కులు, శానిటైజర్లే కాదు..చివరికి తినే తిండి పదార్ధాల విషయంలోనూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖతార్ లోని ఉమ్ అబిరియా ప్రాంతంలోనూ కొందరు వ్యక్తులు ఇలాంటి మోసానికే పాల్పడబోయి పోలీసులకు దొరికిపోయారు. అరబ్, ఆసియా దేశాలకు చెందిన 19 మంది..గడువు ముగిసిన ఆహార పదార్ధాల ప్యాకెట్లను పడేయకుండా మళ్లీ కొత్తగా ప్యాక్ చేసి అమ్మేందుకు ప్రయత్నించబోయారు. అయితే..పోలీసుల తనిఖీల్లో వారి గుట్టుబయటపడింది. 19 మందిని అరెస్ట్ చేసి..న్యాయపరమైన విచారణకు తరలించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







