కోవిడ్ 19: రమదాన్ మాసంలో పది మందికి మించి గుమికూడొద్దు!
- April 24, 2020
దుబాయ్:కరోనా కట్టడి కోసం పవిత్ర రమదాన్ మాసంలో పాటించాల్సిన జాగ్రత్తలపై దుబాయ్ ప్రభుత్వం కొత్తగా మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పది మంది కంటే ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడొద్దని సూచించింది. కరోనా ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సామూహిక ప్రార్ధనలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. అలాగే వైరస్ ఒకరి నుంచి మరొకరిని తేలికగా వ్యాప్తిస్తుంది కనుక కౌగిలింతలు, షేక్ హ్యాండ్ లు కూడా ఇవ్వొద్దని తెలిపింది. సుహూర్, ఇఫ్తార్ విందుల విషయంలోనూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరింది. వీలైనంత వరకు కుటుంబ సభ్యలకే పరిమితం కావాలని, తప్పదనుకంటే అతి సన్నిహితులను ఆహ్వానించుకోవచ్చని అధికారులు సూచించారు. ఇక రమదాన్ మాసంలో ఎలాంటి దానాలు చేయాలన్నా గుర్తింపు పొందిన స్వచంద సంస్థల ద్వారాగానీ, ప్రభుత్వ సంస్థలద్వారా మాత్రమే చేయాలని కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …