అబుధాబి: రమదాన్ మాసంలో 49 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- April 25, 2020
అబుధాబి:ఈ సారి రమదాన్ మాసం భిన్న వాతావరణ పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఏప్రిల్ చివరి వారం, మే తొలి మూడు వారాల పాటు రమదాన్ మాసం కొనసాగనుంది. ఈ నెల రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ పగలు సమయం ఉంటాయని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రోజా పాటించే వారు సాధారణ సమయంలో కంటే ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. రంజాన్ మాసంలో ఎక్కువ రోజులు వేడిగానే ఉంటాయి. సగటున అత్యధిక ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని ఎన్సీఎం అంచనా వేసింది. ఇక మధ్యాహ్నం వేళలో అత్యధికంగా 49 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కొండ ప్రాంతాలు, రాత్రి సమయంలో మాత్రం ఎండవేడిమి నుంచి కొంత మేర ఉపశమనం లభించనుంది. రాత్రి సమయాల్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఎన్సీఎం తెలిపింది. ఇక కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అత్యల్పంగా 9 డిగ్రీల వరకు ఉష్ణోగతలు పడిపోవచ్చని కూడా వెల్లడించింది. ఇక గాలిలో తేమ సాంద్రత తగ్గటంతో ఉక్కపోత పెరగనుంది. ఇదిలాఉంటే..ఈ రమదాన్ నెలలో పగలు సమయం పెరిగనుంది. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు దాదాపు 14 గంటల 16 నిమిషాల పాటు పగలు సమయం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఎక్కువై పగలు సమయం 14 గంటల 57 నిమిషాలకు చేరవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







