సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ 5,75,000 ఆర్థిక సహాయం
- April 26, 2020
పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, "డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యత గా భావించి వారి అకౌంట్ల కు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగింది" అన్నారు.
తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు